పెంటపాడు చెరువు ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. మారుతి వేగనార్ కారు మోపెడ్ పై వెళుతున్న వ్యక్తిని, తదుపరి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టును ఢీ కొట్టి డ్రెనేజీలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మోపెడ్ పై వెళ్తున్న వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. అతనిని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.