తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి లో బర్డ్ ఫ్లోర్ జోన్ ప్రకటించిన కారణంగా గ్రామంలో ఎలాంటి చికెన్ విక్రయాలు కోడిగుడ్లు అమ్మకాలు చేయరాదని ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఎం విశ్వనాథ్ ఆధ్వర్యంలో గ్రామంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీలు విస్తరణ అధికారి ఎం వెంకటేష్, కార్యదర్శి టి రవిచంద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.