పెంటపాడు డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

82చూసినవారు
పెంటపాడు డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. కోలాటం, భోగి మంటలు వేసి, సంక్రాంతిని ప్రతిబింబింపజేశారు. భారతీయ సాంప్రదాయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హెచ్ వో డి గోపాల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్