తాడేపల్లిగూడెం: అతని నుంచి 9 బైక్ లు స్వాధీనం

68చూసినవారు
తాడేపల్లిగూడెం: అతని నుంచి 9 బైక్ లు స్వాధీనం
మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసులో పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్యను అరెస్ట్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆది ప్రసాద్ వివరాలను వెల్లడించారు. తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. రూ.13 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్సై నాగరాజు, సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్