తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు డాక్టర్ ఎస్. ప్రశాంతి అరుదైన అవార్డు అందుకున్నారు. చెన్నైలోని వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆమెకు యంగ్ విమెన్ రీసెర్చర్ అవార్డు ప్రదానం చేసింది. ఆమె పరిశోధనలు, ప్రచురణలు, పేటెంట్లు, పుస్తకాలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ సోమవారం ఈ విషయం వెల్లడించారు.