తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి 25వ వార్డు మహిళలు, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా వారు ఎమ్మెల్యేను కలిసి, డ్రెయిన్లు తీయడం లేదని, వీధిలైట్లు వెలగడం లేదని, ప్రాంతం అభివృద్ధిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. సమస్యను కమిషనర్‌కు చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు.