తాడేపల్లిగూడెం వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో 13ఏళ్ల బాలుడికి బెడ్ కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణానికి చెందిన మిరాకిల్ ప్రభు శుక్రవారం ఉదయం కళ్లు తిరిగి పడిపోవడంతో అతని తల్లి ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకెళ్లింది. కానీ సిబ్బంది బెడ్ కేటాయించకుండా బల్లపై పడుకోబెట్టి సెలైన్ ఇచ్చారు. పర్యవేక్షణ లేకపోవడం కారణంగా సిబ్బంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లుతున్నాయి.