తాడేపల్లిగూడెం: రెండు బస్సులపై కేసులు నమోదు

279చూసినవారు
తాడేపల్లిగూడెం: రెండు బస్సులపై కేసులు నమోదు
తాడేపల్లిగూడెం రవాణా శాఖ పరిధి గణపవరం మండలం పిప్పరలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ శనివారం తనిఖీలు నిర్వహించారు. ట్యాక్స్ చెల్లించని, ఎఫ్‌సీ లేకుండా తిరుగుతున్న రెండు బస్సులపై కేసులు నమోదు చేసి, రూ. 39వేలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు ఎంవీఐ సురేంద్ర సింగ్ నాయక్ వివరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఎంవీఐ సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్