ఎంతటి అక్రమాలు చేశారో చెప్పలేక వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా కూటమిపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం విశ్వదుర్గేశ్వరిపేటలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న ఆయన, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏమి చేశారో చెప్పాలని, కూటమి ఏడాదిలో చేసిన అభివృద్ధిని తాము వివరించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.