రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టిడిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్ వలవల బాబ్జి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా దావోస్ లో చంద్రబాబు పర్యటన జరిగిందన్నారు. అక్కడి పారిశ్రామిక వేత్తలు రెడ్ కార్పెట్ పరిచారన్నారు.