పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో వినిపిస్తామని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వలవల బాజ్జీ అన్నారు. పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణం 4వ వార్డులో పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. పట్టభద్రుల సమస్యలపై కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి నాయకులు పట్నాల రాంపండు, యెరుబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు పాల్గొన్నారు.