ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలోని పశువైద్యశాలలో ఈ నెల 6న కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తామని సహాయ సంచాలకులు టీవీ విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేయడం ఎంతో అవసరమని అన్నారు.