తాడేపల్లిగూడెం: బాలికలను తల్లిదండ్రులకు అప్పగింత

78చూసినవారు
తాడేపల్లిగూడెం: బాలికలను తల్లిదండ్రులకు అప్పగింత
ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలికలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించామని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రమేశ్ తెలిపారు. ఆదివారం సర్కిల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా చాట్‌లు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చెన్నై వెళ్లిన వారిని గుర్తించామన్నారు. పట్టణ సీఐ ఆది ప్రసాద్, ఎస్సైలు ప్రసాద్, స్వామి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్