దేశంలో ముఖ్యమైన వనరులలో భూమి చాలా కీలకమని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరి కునాల్ సత్యార్థి అన్నారు. రాష్ట్రంలో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న తాడేపల్లిగూడెంలో ప్రజాభిప్రాయ సేకరణకు శుక్రవారం ఐఏఎస్ అధికారి నిరంజన్ కుమార్ సుధాన్ష్‌తో కలసి సత్యార్థి పాల్గొన్నారు. జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సత్యార్థి, సుధాన్ష్ రీ సర్వే వల్ల ఇ బ్బందులు, ప్రయోజనాలపై ఆరా తీశారు.