లోక్ అదాలత్ లో కక్షిదారులకు ఉచితంగా న్యాయసహాయం అందుతుందని తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కోర్టులను ఆశ్రయించలేని పేదలు ఎలాంటి ఖర్చు లేకుండా సామరస్యంగా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ధనం, సమయం ఆదా అవుతుందన్నారు. సీనియర్ సివిల్ జడ్జి మాధవి, న్యాయమూర్తి సూర్య కిరణ్ పాల్గొన్నారు.