తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీత సామాజిక వర్గానికి కేటాయించిన మద్యం షాపులకు గురువారం మధ్యాహ్నం 3. గంటలకు భీమవరంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ హాల్లో లాటరీ పద్ధతిన షాపులు కేటాయించనున్నట్లు సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుదారులకు కేటాయించిన ఎంట్రీ పాసులు, కుల ధ్రువీకరణ ప్రతాలతో ఒక గంట ముందుగా హాజరుకావాలని సూచించారు.