తాడేపల్లిగూడెం: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

60చూసినవారు
తాడేపల్లిగూడెం: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం పట్టణంలోనే స్థానిక మహాలక్ష్మి నగర్‌లో డ్రైనేజీ పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి తమ్మిశెట్టి శ్రీను (55) శనివారం సాయంత్రం మృతి చెందాడు. కొండ్రుప్రోలు కాలనీకి చెందిన శ్రీనును వెంటనే తోటి కూలీలు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్