తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం చేస్తుండగా దార్లంక మునేశ్వరరావు (35) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.