సామాన్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేసేలా రాజ్యాంగం ద్వారా హక్కు కల్పించిన మహానీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం, తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.