తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే బొలిశెట్టిని ఘనంగా సత్కరించింది.