తాడేపల్లిగూడెం: 48 గంటల్లోపు రైతులకు సొమ్ములు జమ

52చూసినవారు
తాడేపల్లిగూడెం: 48 గంటల్లోపు రైతులకు సొమ్ములు జమ
రైతాంగం సమస్యల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జి వలవల బాబ్జీ వైసీపీ నాయకులనుద్దేశించి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపు రైతులకు సొమ్ములు జమ అయ్యాయన్నారు. రైతాంగానికి మే నెలలో కేంద్రం ఇచ్చే నిధులతో సొమ్ములు జమ చేస్తామన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి సొమ్ములు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్