తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం, జగన్నాథపురం, దండగర్ర, కడియద్ద గ్రామాల్లో గతంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలపై అందిన ఏడు అర్జీలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వీటిపై గురువారం ఆయా గ్రామాల్లోని సచివాలయం వద్ద సీసీఎల్ఏ (అమరావతి) అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఆయన వెంట తహశీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో విశ్వనాథ్ ఉన్నారు.