తాడేపల్లిగూడెం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

54చూసినవారు
తాడేపల్లిగూడెం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక 31 వార్డుకు చెందిన మైనర్ బాలికకు మే 10న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. స్థానికులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫిర్యాదు చేయడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గ భవాని, విశాలాక్షి గురువారం వివాహాన్ని అడ్డుకున్నారు. 10వ వార్డుకు చెందిన మరో బాలిక తనకు ఇష్టం లేకుండా వివాహం చేశారంటూ సచివాలయాన్ని ఆశ్రయించడంతో అధికారులు ఆమెను రక్షించారు.

సంబంధిత పోస్ట్