సీపీఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్ధార్ టి. డేవిడ్ కి వినతిపత్రం, లబ్ధిదారుల వ్యక్తిగత దరఖాస్తులను సమర్పించారు. ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.