తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామ శివారులో కోత బంతి (పేకాట) ఆడుతున్నారని సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 5470లు నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.