తిరుమల లడ్డూ కల్తీపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిమాండ్ రిపోర్ట్ పై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. లడ్డూలో కల్తీ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని సిట్ తేల్చి చెప్పిందన్నారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.