సంక్రాంతి పండుగ ముసుగులో జోద క్రీడలు ఆడితే ఉపేక్షించేది లేదని తాడేపల్లిగూడెం పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులు మేరకు గ్రామాలలో గురువారం గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.