పాలిటెక్నిక్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 21 నుంచి 28 వరకు అభ్యర్థులు తమ ర్యాంక్‌కు అనుగుణంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. జూన్ 27లోపు ప్రవేశ రుసుము ఆన్లైన్లో చెల్లించాలి. తాడేపల్లిగూడెం ప్రభుత్వ కళాశాలలో 120, 8 ప్రైవేటు కాలేజీల్లో 3,500 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, నకళ్లు మర్చిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.