తాడేపల్లిగూడెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 1.5 కిలోల గంజాయిని టౌన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆది ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ వార్డు, బాపూజీ పుంత రోడ్డు, డోర్ నంబర్ 4-164-54/1 వద్ద గల పాడుబడిన ఖాళీ డాబా ఇంటి వద్ద గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.