తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం వాసి దండే నాగ ప్రసన్న ఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకుని తొలిసారిగా సోమవారం సాయంత్రం గ్రామానికి విచ్చేశారు. ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో నాగ ప్రసన్న మాట్లాడుతూ. గ్రామస్థులు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయ మహిళా పోలీసు స్థాయి నుంచి ఎస్ఐగా మారడం సంతోషంగా ఉందన్నారు.