తాడేపల్లిగూడెం: రాజ శేఖరంను గెలిపిస్తామని ప్రతిజ్ఞ

73చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల బాబ్జీ అధ్వర్యంలో గురువారం తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖరం విజయం కోసం ప్రతి క్షణం పనిచేస్తామని కూటమినేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పెంటపాడు మండలం మౌంజీపాడు, పడమర విప్పర్రు, ఉమామహేశ్వరం, జట్లపాలెం, కస్పా పెంటపాడు, యనాలపల్లి, పరిమెళ్ళ గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్