రాజ్యాంగం కల్పించిన చట్టాలను గౌరవిస్తూ స్వాతంత్ర ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఫ్యాకల్టీలకు బహుమతుల అందజేశారు.