టెన్త్ సప్లీ ఫలితాలు. వెస్ట్ గోదావరిలో 50.24% మంది పాస్

80చూసినవారు
టెన్త్ సప్లీ ఫలితాలు. వెస్ట్ గోదావరిలో 50.24% మంది పాస్
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 4,570 మంది పరీక్ష రాయగా, కేవలం 2,296 మంది ఉత్తీర్ణత సాధించడంతో ఉత్తీర్ణత శాతం 50.24గా ఉంది. ఈ స్థితితో జిల్లా రాష్ట్రంలో అట్టడుగున నిలిచింది. బాలురలో 2,879 మంది రాయగా 1,338 మంది, బాలికల్లో 1,691 మంది రాయగా 958 మంది పాస్ అయ్యారు. రీకౌంటింగ్‌కు (ఒక్క సబ్జెక్ట్ రూ.500), రీవెరిఫికేషన్‌కు (రూ.1000) జూన్ 19 వరకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్