పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

4677చూసినవారు
కారు డివైడర్‌ను ఢీకొని ఆపై పంట కాలువలోకి బోల్తా కొట్టిన సంఘటన శనివారం తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. నిడదవోలు నుంచి ఏలూరు వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా డివైడర్‌ను ఢీకొని తదుపరి పల్టీలు కొడుతూ కాలువలోకి బోల్తా కొట్టిందని స్థానికుల సమాచారం. ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని సంభవించలేదు.

సంబంధిత పోస్ట్