పురపాలక సంఘంలో జరిగిన అవినీతి ని బయట పెడతామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెళ్లే సమయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది విధులు కు హాజరు కాకపోవడం పై సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వం మాదిరిగా సిబ్బంది అలసత్వం వహించి ప్రజల సమస్యలు పెడ చెవిని పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.