తాను తలుచుకుంటే బాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్న మాజీ సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు తెలుసునని, వైనాట్ 175 నుంచి 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ప్రజలకు ఇస్తానన్న రూ. 4వేలు పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు.