తణుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాన్ని అసిస్టెంట్ కమిషనర్ కె. నాగప్రభుకుమార్ గురువారం సందర్శించారు. గంజాయి, డ్రగ్స్ తదితర నేరాలకు సంబంధించి నివారణ చర్యలు, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం పలు పరిశ్రమలను సందర్శించి ఇథనాల్, ఆర్ఎస్ యూనిట్లను తనిఖీలు చేశారు. తణుకు సీఐ ఎస్. మణికంఠరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.