అత్తిలి: జాతరలో కొట్లాట ఘటనపై కేసు నమోదు

79చూసినవారు
అత్తిలి: జాతరలో కొట్లాట ఘటనపై కేసు నమోదు
అత్తిలి మండలం మంచిలిలో పల్లాలమ్మ జాతరలో జరిగిన కొట్లాట ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్లాలమ్మ ఊరేగింపులో భాగంగా హేమదుర్గపై అదే గ్రామానికి చెందిన దిలీప్, రాజేశ్, విషవి, యాకోబు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన హేమదుర్గను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు

సంబంధిత పోస్ట్