అత్తిలి మండలంలోని గుమ్మంపాడు, అత్తిలి గ్రామాలలో ఏర్పాటు చేసిన కోడిపందాల బరులను తహశీల్దార్ వంశీ మండల అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. తమ ఆంక్షలు మీరి జీవహింసకు పాల్పడితే వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.