అత్తిలి మండలం మంచిలి గ్రామం లో కొలువైవున్న అలివేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి దాతలు పంచలోహ విగ్రహం ఇచ్చారు. గ్రామానికి చెందిన వెలగల కృష్ణారెడ్డి, వెలగల శివారెడ్డి, వెలగల దుర్గారెడ్డిలు సంయుక్తంగా అందచేశారు. మూల విరాట్ కి అన్ని రకాల అభిషేకాలు నిర్వహించడం ఇబ్బంది కావున, అభిషేకాలు నిమిత్తం పంచలోహ విగ్రహాన్ని అందచేసినట్లు కృష్ణారెడ్డి, శివారెడ్డి వెల్లడించారు