ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు తండ్రి సింహాచలం ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో సోమవారం అత్తిలి మండలానికి చెందిన టీడీపీ నాయకులు విశాఖపట్నంలోని పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి సింహాచలానికి నివాళులు అర్పించి, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అత్తిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి అర్తి సత్యనారాయణ, మంచిలి టీడీపీ అధ్యక్షులు శిరగాని నాగేశ్వరరావు, గోనగాల సూర్య రాజు పాల్గొన్నారు.