అత్తిలి: కూటమిలో చేరిన వైసీపీ ఎంపీటీసీలు

66చూసినవారు
అత్తిలి: కూటమిలో చేరిన వైసీపీ ఎంపీటీసీలు
అత్తిలి మండలం ఎంపీపీ స్థానం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోనుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరారు. దీంతో కూటమి 10 స్థానాలకు చేరుకుందని చెప్పారు. ఈనెల 19న జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ స్థానం కైవసం చేసుకోనుందని వెల్లడించారు. అలాగే పార్టీలో చేరిన ఎంపీటీసీ సభ్యులను జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు అభినందించారు.

సంబంధిత పోస్ట్