కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం తణుకు కూటమి కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.