ప్రజాపాలనకు రాజ్యాంగ పీఠిక ప్రమాణం అనే అంశంపై సదస్సు

52చూసినవారు
ప్రజాపాలనకు రాజ్యాంగ పీఠిక ప్రమాణం అనే అంశంపై సదస్సు
రాజ్యాంగంపై మతతత్వవాదులు జరుపుతున్న దాడులను తిప్పి కొట్టడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ప్రముఖ సామాజిక వేత్త డీవీవీఎస్‌ వర్మ పేర్కొన్నారు. తణుకు సురాజ్యభవన్‌లో ఆదివారం నిర్వహించిన దారిదీపం మాసపత్రిక మిత్రుల సమాలోచన సభలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ బండ్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజ్యాంగ పీఠిక–ప్రజాపాలనకు దారిదీపం అనే అంశంపై వక్తలు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్