విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం కార్యాలయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.