రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ తణుకులో సిపిఐ బైక్ ర్యాలీ

80చూసినవారు
రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ తణుకులో సిపిఐ బైక్ ర్యాలీ
ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పశ్చిమగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి కోణాల భీమారావు పిలుపునిచ్చారు. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ.. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం శుక్రవారం తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్