తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొని కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.