ఇరగవరం మండలంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.