ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో పుస్తకాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం విద్యార్థులకు అందచేశారు. అనంతరం సన్న బియ్యంతో మథ్యాహ్న భోజన పథకం ప్రారంభించి, పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య అభివృద్ధికి, పిల్లలకు మంచి పోషకాహారం అందించటానికి మన ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.