తాడేపల్లిగూడెంలో ఒక స్వీటు షాపు కార్ఖానాలో విద్యుత్ షాక్ తగిలి సేగల సూరిబాబు (33)గురువారం మృతి చెందారు. కార్ఖానాలో గ్రైండర్ స్విచ్ వేస్తుండగా షార్ట్ సర్క్యూట్ తగిలి స్పృహ తప్పి పడిపోయారు. హుటాహుటిన బాధితున్ని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్య ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.